AP: మామిడి పంటకు బీమా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురంలో 15 శాతం, ఎన్టీఆర్, వైఎస్సార్, కాకినాడ, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, విజయనగరం జిల్లలాల్లో 16.77 శాతం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, తూ.గో. జిల్లాల్లో 17.74 శాతం, అనకాపల్లి, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో 16.08 శాతం చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు. రుణాలు తీసుకునే వారితో పాటు లేని వారికీ స్వచ్ఛందంగా బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.