దేవరకద్ర: బీటీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

85చూసినవారు
దేవరకద్ర: బీటీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో నెల్లికొండి నుండి నల్లగుట్ట తండా వరకు, నెల్లికొండి నుండి దమగ్నాపూర్ వయా సీతారాంపేట్ బీటీ రోడ్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్