ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు సీఎం చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు. రఘురామ కృష్ణరాజుకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయనను కేబినెట్ మంత్రి హోదాతో సమానంగా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఇకపై రఘురామను మంత్రులతో సమానంగా పరిగణించాల్సి ఉంటుంది.