నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇంచార్జ్ నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం మార్నింగ్ వాకర్స్‌ను కోరారు. వారు మాట్లాడుతూ... ఈ ప్రాంత ఆడబిడ్డను ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రాంతానికి ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా వెళ్లి పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వాణీదేవికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.