నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి
తెల్కపల్లి మండలానికి చెందిన సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వెంకటాపురం బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో బైక్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు సోమవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు, సత్యనారాయణ తన కుమార్తె దగ్గరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.