తెల్కపల్లి మండలం చిన్నముదునూర్ గ్రామంలో వర్షాల వల్ల కొన్ని వీధులు అన్ని బురదమయంగా మారాయి. చినుకు పడితే చాలు రహదారి అంతా చిత్తడి నేలగా అవ్వడంతో గ్రామస్తులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల రాకపోకలకు ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అధికారులు వీధులను త్వరగా మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.