కుక్కల దాడిలో జింక మృతి
పొలాల్లో తిరుగుతున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో చోటుచేసుకుంది. తిమ్మాజిపేటలోని కోట వెనుకభాగంలో పొలం పనులకు వెళ్లిన రైతులకు తీవ్రంగా గాయపడిన జింక కంటపడింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. పశు వైద్యాధికారి జింకకు చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. నాగర్ కర్నూల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంటి సంఘటనా స్థలానికి చేరుకొని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.