ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు లకినేనిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో క్రిష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని తొట్టెల్లో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పున్న వేణు, గణేష్ ఆలయ కమిటీ సభ్యులు పాశం నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.