లక్ష్మాపూర్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

83చూసినవారు
లక్ష్మాపూర్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామ పాఠశాలలో శుక్రవారం సర్పంచ్ సత్యనారాయణ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తన వంతు సహకారంగా నోటు పుస్తకాలను పంపిణి చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :