మూసి ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత

808చూసినవారు
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ గేటును అధికారులు గురువారం పైకెత్తారు. మూసి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 162.92 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, మూసి ప్రాజెక్ట్ 3వ నెంబర్ గేటు పైకెత్తి కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.60 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి ఉదయ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్