గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసిఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాకారంలో అనేక విజయాలు సాధించిందని చందంపేట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కేతావత్ లక్ష్మ నాయక్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందు వరుసలో నిలిచి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, షాది ముబరక్ , తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి అనేక పథకాలతో దేశానికి మార్గదర్శిగా ఎదిగి, నేడు దేశ రాజధానిలో గులాబీ జెండాను గుండెల నిండా సంతోషంతో ఎగురవేసుకుంటున్న సందర్భం అని, ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా సగర్వంగా ఉంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేతవాత్ లక్ష్మ నాయక్, ముత్యాల సర్వయ్య, యూత్ ప్రెసిడెంట్ కేతావత్ రమేష్ నాయక్, సర్పంచ్ లు అర్జున్, దేవ, మకట్లల్, నెహ్రూ, రవి, నారాయణ రెడ్డి ముత్యాల రవి, మున్నయ, సేవులు, రమణ శంకర్ , అంజి, గోవర్ధన్, మల్లేష్, నర్సింహ, లాల్సింగ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.