నేరేడుగోమ్ము మండల పరిధిలోని బుగ్గ తండా గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సరియ నాయక్ సోమావారం మాట్లాడుతూ.. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ సమీపించింది. ఇంతవరకు ప్రభుత్వ మహిళలకు చీరల పంపిణీ చేపట్టలేకపోయిందని విమర్శించారు.