రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేవరకొండలోని ఎస్ఎఫ్ఐ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రభుత్వ బడుల్లో సరైన వసతులు లేవని, స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు అన్నారు. నరేష్, లక్ష్మణ్ నాయక్, వెంకటేష్, రాకేష్, ఇద్దిరాములు, జైచరణ్, శివ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.