కొండమల్లేపల్లి మండల పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి పెండ్లిపాకల ఎక్స్ రోడ్ వద్ద జరుగుతున్న వరుస ప్రమాదాలను నిలువరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణ కోసం ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై రామ్మూర్తి జాతీయ రహదారిపై ఇరువైపులా బుధవారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఎక్స్ రోడ్ వద్ద వాహనాల వేగ నియంత్రణ లేకపోవడంతో ఇటీవల జరిగిన పలు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు దుర్మరణం చెందారు.