డిండి బస్టాండ్ బాగుపడేది ఎప్పుడు

84చూసినవారు
డిండి బస్టాండ్ బాగుపడేది ఎప్పుడు
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అద్వానంగా మారింది. బస్టాండ్ ఆవరణ కంకర రాళ్లు తేలి బస్టాండులోకి వచ్చే ప్రయాణికులకు నడవడానికి వీలు లేకుండా తయారైంది. బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చిన చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు కింద పడి గాయాలపాలైన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. బస్టాండ్ ఆవరణ బాగు చేయాలని గురువారం పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్