మునగాల మండలం గణపవరంలో తల్లిదండ్రులు లేని నిరుపేద రజక కుటుంబానికి చెందిన పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా శ్రీకృష్ణ యూత్ 22, 900, అంబేద్కర్ యూత్ యువకులు 3000 రూపాయలు ఆర్థిక సాయం చేసి పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ అనాధగా మిగిలిన మహేశ్వరి తమ్ముళ్లకు అండగా నిలిచిన యూత్ సభ్యులను అభినందించారు.