అపోలో రీచ్ హాస్పిటల్ 250 మందికి వైద్య పరీక్షలు

1351చూసినవారు
అపోలో రీచ్ హాస్పిటల్ 250 మందికి వైద్య పరీక్షలు
అపోలో రీచ్ హాస్పిటల్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరంలో 250 మందికి వైద్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో యంపిపీ అమరావతి సైదులు అధ్యక్షతన ప్రజలకి బీపీ , షుగర్, మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా డాక్టర్ పరీక్షించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ డాక్టర్స్ మూడవత్ విజెందర్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, డాక్టర్ మురళీకృష్ణారెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ రాగమాళికాదేవి గైనకాలజిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ గోపికృష్ణ , మార్కెటింగ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సుమన్, పారామెడిక్ టీం జటంగి సైదులు, సైదయ్య మరియు వైద్య సిబ్బంది, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు ముక్క లింగయ్య యాదవ్, దుర్గయ్య, చనగాని వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్