జులై 9న బీసీల రాజకీయ ప్లీనరీ

263చూసినవారు
జులై 9న బీసీల రాజకీయ ప్లీనరీ
వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్ లో దాదాపు పది వేల మంది బీసీ ప్రతినిధులతో రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణంలో ని బీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్లీనరీ సమావేశంలో బీసీల రాజకీయ దశ-దిశపై చర్చిస్తామన్నారు. మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల సీట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా బీసీ డిక్లరేషన్ నమ్మి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు ప్రధాన రాజకీయ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 60 సీట్లు ఇస్తామని విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, రాంబాబు యాదవ్, వంశీ, అంజి యాదవ్, రమేష్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్