కేజీవీబీలో పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్లను రెగ్యూలర్ చేయాలి

672చూసినవారు
కేజీవీబీలో పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్లను రెగ్యూలర్ చేయాలి
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్లను పర్మినెంట్ (సీఆర్టీ) క్యాజువల్ రిలీఫ్ టీచర్లుగా గుర్తించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమవారం ఈమెయిల్ ద్వారా లేక పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించి వీరి వేతనాలలో వ్యత్యాసం లేకుండా సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా ఇవ్వాలని ఈయన సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల వారిని క్రమబద్ధీకరణ చేసినట్లుగానే వీరిని పర్మినెంట్ చేసి ఆదుకోవాలని జాజుల పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్