14న పోలీస్ శాఖలో కొలువుల శిక్షణకు అర్హత పరీక్ష

1213చూసినవారు
14న పోలీస్ శాఖలో కొలువుల శిక్షణకు అర్హత పరీక్ష
ఈనెల 14న పోలీస్ శాఖలో కొలువుల శిక్షణకు అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ చైర్మన్,
యువనేత నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. ఔత్సాహిక విద్యార్థుల అభ్యర్ధన మేరకు అర్హత పరీక్ష దరఖాస్తులను ఈ నెల10 వరకు స్వీకరించనున్నట్టు సిద్దార్ధ తెలిపారు. ఉచిత శిక్షణకు సంబంధించి అవసరమైన దరఖాస్తులు మిర్యాలగూడ సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే అందుబాటులో ఉంచామని అన్నారు.

దరఖాస్తుదారులు అప్లికేషన్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు స్థానిక గ్రంథాలయంలోనూ పొందవచ్చని తెలిపారు. కాగా, ఎన్బీఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఉమ్మడిగా మిర్యాలగూడ నియోజకవర్గ యువతకు పోలీస్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందిన నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు సంపాదించుకొని స్థిరపడ్డారు. 2018లో నలుగురు ఎస్సైలుగా, 33 మంది పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. నలుగురు పంచాయతీ సెక్రెటరీలుగా, ఇద్దరు వీఆర్వోలుగా ఎంపికయ్యారు.

ఇదే స్ఫూర్తి తో మరికొంతమంది నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరికల్లా తీర్చిదిద్దాలని, తద్వారా వారి ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పూనుకున్నారు. నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఉద్యోగాల్లో నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

దరఖాస్తు ఫారంతో పాటు జత చేయాల్సినవి:

దరఖాస్తు ఫారంతో పాటు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాల జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రింటెడ్ హాల్ టికెట్(మెయిన్స్)2018 జతచేసి ఆగస్టు10లోపు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లేదా స్థానిక గ్రంథాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఉచిత కోచింగ్ కోసం ఎంపిక విధానం, రాతపరీక్ష, దేహదారుడ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్