జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు వెంటనే ఇవ్వాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ జర్నలిస్టులు మంగళవారం వినూత్నంగా ఆర్డీవో కార్యాలయం చెవిలో పువ్వులతో నిరసన నిర్వహించారు. సిపిఎం,
కాంగ్రెస్, సిపిఐ, బిజెపి, టిడిపి, బీఎస్పీ, ఏఐఎఫ్బి, ఇతర ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో డిఎఒ రాధకు వినతిపత్రం సమర్పించారు.