రేపు మిర్యాలగూడలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ల పర్యటన

1116చూసినవారు
రేపు మిర్యాలగూడలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ల పర్యటన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదిక భవనాలు, భూసార పరీక్షా కేంద్రంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేసే దిశగా తగు ఏర్పాట్లను చేయాలని పార్టీ శ్రేణులకు దిశా, నిర్దేశం చేశారు. రైతు వేదిక భవనాల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించే రైతు సభల్లో మంత్రులు మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రైతు వేదిక భవనాలు ఉపయోగపడతాయని భాస్కర్ రావు తెలిపారు. కాగా, రైతులను సంఘటితం చేసే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదిక భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయించిన భాస్కర్ రావు వీటి యొక్క సేవలను అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి ఐదు లిఫ్టులను మంజూరు చేయించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఐదు రైతు వేదిక భవనాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండువ వాతావరణం నెలకొంది. మిర్యాలగూడ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్