మిర్యాలగూడ: ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

82చూసినవారు
మిర్యాలగూడ: ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
మిర్యాలగూడ మండలంలోని పలు దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు వేకువజామునే నదీస్నానాలను ఆచరించి వైష్ణవ శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూసి ఒడ్డున కొలువైన సోమప్ప దేవాలయంలో, పట్టణంలోని ఉమా మహేశ్వర దేవాలయంతో పాటుగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జ్వాలా తోరణం కార్యక్రమం ఉంటుందని ఉట్లపల్లి గ్రామ పురోహితులు సుదర్శనం కిషోర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్