తమిళిసై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

858చూసినవారు
తమిళిసై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి(77) మృతిపట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ తల్లి కృష్ణకుమారి గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోధ ఆస్పత్రిలో ఆదివారం నుంచి చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం గా. 3-30నిమిషాలకు తుది శ్వాసవిడిచినట్టు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఆమె భౌతిక కాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు సందర్శకుల సందర్శనార్ధం రాజ్ భవన్ లో ఉంచారు. గురువారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణకుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్