దివంగత కౌన్సిలర్ మల్లమ్మ నిర్యాణంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు

449చూసినవారు
దివంగత కౌన్సిలర్ మల్లమ్మ నిర్యాణంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ టీఆర్ఎస్ నాయకులు ఐల వెంకన్న తల్లి, ప్రకాష్ నగర్- 9వ వార్డు కౌన్సిలర్ ఐల మల్లమ్మ గతనెల 26న కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు. బుధవారం ఆమె నివాసంలో నిర్వహించిన నిర్యాణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఐల మల్లమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపుడి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, తదితరులు ఐల మల్లమ్మ నిర్యాణంలో పాల్గొని ఐల మల్లమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్