విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి : సురేష్ యాదవ్

62చూసినవారు
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి : సురేష్ యాదవ్
కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని బుధవారం బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రైవేటు పాఠశాలలు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నాయాన్నారు. ఈ కార్యక్రమంలో రాము, శ్రీకాంత్, విఘ్నేష్, ఏసురాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్