శ్రీకాంతాచారి అమరత్వంతో తెలంగాణ సాధన

1927చూసినవారు
శ్రీకాంతాచారి అమరత్వంతో తెలంగాణ సాధన
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి అమరత్వంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ నాయక్ అన్నారు. శ్రీకాంతాచారి 14వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూల దండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను వదిలిన గొప్ప వ్యక్తి శ్రీకాంతాచారి అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్