న్యాయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ జోక్యం విచారకరం

85చూసినవారు
న్యాయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ జోక్యం విచారకరం
చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం జరిగిన సిపిఎం గ్రామ శాఖ మహాసభకు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతపరమైన కార్యక్రమాలు పెరిగి, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులపై దాడులు దౌర్జన్యాలు, నిర్బంధాలు కూడా పెరిగాయని అన్నారు. రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించాలనే యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్