నకిరేకల్ మండల పరిధిలో సోమవారం అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ఏర్పాటుచేసిన అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా కేంద్రాన్ని సోమవారం నకిరేకల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన విలేజ్ కోఆర్డినేటర్ లకు ఆర్డర్ ఫారమ్స్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నిరక్షరాస్యత నిర్మూలన కోసం అక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేయటాన్ని అభి హెల్ప్ లైన్ వారిని అభినందించారు. గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.