నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల పద్మశాలి భవనంలో ఆదివారం స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకం ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు చెరుపల్లి రఘుపతి సీఎం రేవంత్, చేనేత మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, నేతన్నలకు సంక్షేమ పథకాలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.