చేనేత సంఘాల పెండింగ్ నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వంత నిధులతో భవనాన్ని నిర్మించుకున్న సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.