కట్టంగూర్ మండలంలో గ్రామపంచాయతీ పరిధిలో గల పలు వార్డులలో సాగర్ ట్యాంకుల యొక్క నల్లాలు తుప్పు పట్టి విరిగిపోవడంతో సాగర్ నీరు వృధాగా పోతున్నాయి. ఈ విషయమై చాలాసార్లు ఉన్నతాధికారులకు, స్థానిక వార్డ్ నెంబర్లకు, సర్పంచికి చెప్పిన మరమ్మత్తు చేయకపోగా పట్టనట్టుగా ఉండడం జరుగుతుంది. వేసవి కాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నతాధికారులు స్పందించి విరిగిన నల్లాలను మరమ్మతు చేసి కొత్త నల్లాలను వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.