చిట్యాల మండలం ఎలికట్టె, ఉరుమడ్ల గ్రామాలలో గురువారం జరిగిన సిపిఎం గ్రామశాఖల మహాసభలలో జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ హాజరై మాట్లాడారు. రైతులు, కార్మికుల, కష్టజీవుల సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాలని అన్నారు. కమ్యూనిష్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో పనిచేస్తారని చెప్పారు. మునుగోడు వరకు 10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసి ప్రజల రవాణాకు సౌకర్యం కల్పించాలన్నారు.