వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.