యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒక మహిళ అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చింది. గౌరవ్, ప్రీతిలకు కొంతకాలంక్రితం పెళ్లైంది. అయితే ప్రీతి తన మేనల్లుడు నిమిష్ తో అక్రమ సంబంధం పెట్టుకోగా భర్తకు తెలిసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని అల్లుడితో కలిసి ప్లాన్ చేసింది. అయితే నిమిష్ తన స్నేహితుడు తరుణ్ తో కలిసి గౌరవ్ ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.