నల్గొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, షీ- టీం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పోలీస్ శిక్షణా కేంద్రం సంయుక్త ఆధ్వర్యములో యాసిడ్ దాడుల నేరాలు, పరిణామాలు, చట్టం అమలుపరిచే శిక్షలు మరియు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన పథకం పై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి జి. వేణు మాట్లాడుతూ యాసిడ్ దాడులు చేయడం ఒక అమానుష నేరమని దీనికి తీవ్ర శిక్షను అనుభవించాల్సి ఉంటుందని, యాసిడ్ దాడులకు గురైన బాధితులు నష్ట పరిహారం పొందవచ్చునని తెలిపారు. ఇందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చట్ట పరమైన పూర్తి సహాయం అంద చేస్తుందన్నారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె.నరేందర్ కుమార్ మాట్లడుతూ ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ఉండాలని, విద్యార్థి దశ నుంచే చట్టంపై మన రాజ్యాంగంపై అవగాహనా పెంచుకోవాలని తద్వారా కొంతమేర నేర ప్రవృత్తి నివారణ అవుతుందని తెలిపారు. పోలీసు శిక్షణా కేంద్రం ఇంఛార్జి సింగం శ్రీనివాస్ పోలీసు శిక్షణ విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే ఆవశ్యకత గురించి తెలియజేసారు. కళాశాల లెక్చరర్ సుధారాణి కార్యక్రమ అతిథులకు ఆహ్వానం పలికారు. పోలీసు కళా బృందం ఇంఛార్జి హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ ఆధ్వర్యములో షీ- టీం నిర్వహించే సేవలను తెలియజేశారు. అలాగే చైతన్య గీతాలు ఆలపించి విద్యార్థులలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వృత్తి విద్య కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి, సీనియర్ లెక్చరర్ తాడిశెట్టి నర్సింహ, జి.వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్ వి. కొండల్, డాక్టర్ అన్సారి, పోలీసు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు, షీ టీం ఎ.ఎస్. ఐలు విజయలక్ష్మి, కృష్ణ, పి.సి విజయ, రమేష్ పాల్గొన్నారు.