పోలీసు నియామకాల్లో జరిగిన అవకతవకలపై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తెలిపారు.బుధవారం నల్లగొండలోని ఎంపీ కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్ పిలుపుమేరకు చేపట్టే కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు.