గార్లబాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

2341చూసినవారు
నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని గార్లబాయిగూడెం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు సముద్ర నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే మహిళల ఔన్నత్యం, సమాజంలో మహిళల కీలకపాత్ర వివరిస్తూ విద్యార్థులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకమండలి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్