నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి నీటి శుద్ధి కేంద్రంలో శుక్రవారం మిషన్ భగీరథ కార్మికులు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధి కేంద్రంలోని కార్మికులు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ పండుగ అంటే రంగులు చల్లుకోవడమే కాదు ఆప్యాయత అనురాగాలు పంచుకోవడం అని అన్నారు. హోలీ పండుగలాగా సప్త వర్ణాలలు జీవితంలో సుఖసంతోషాలు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి సైదులు, మంద కృష్ణ మాదిగ మరియు మహిళా కార్మికులు రేణుక, సునీత, సలోమి, రాధ తదితరులు హోలీ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు.