సమగ్ర కుటుంబ సర్వేకై ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ప్రారంభమైన సామాజిక , ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని బి టి ఎస్ కాలనీలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని అన్నారు.