మహిళల ముందే పోలీసు ఉన్నతాధికారులను పిలిచి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం సభ్యులు మండల కేంద్రంలో అక్కడక్కడ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. బెల్ట్ షాపులపై పోలీసులు ప్రత్యేకంగా పెట్టాలని అన్నారు.