దేవరకొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, కావలసింది అధికార స్వరాలు కాదు. ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని ఆయన అన్నారు. రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడు, యువకుడైన వ్యక్తి శాసనమండలికి ఎన్నిక కావాలి ఆయన కోరారు.