కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగిన మండల స్థాయి క్రికెట్ పోటీలో రాంనగర్ జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ బహుమతి అనిశెట్టి దుప్పలపల్లి గెలుపొందింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలకు ప్రథమ, ద్వితీయ బహుమతుల గెలుపొందిన విజేతలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైజ్ మనీ అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరి రమేష్, ఇబ్రాహీం అలీ, గంటేగంపు సైదులు, వనపర్తి అంజయ్య, వనపర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.