నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని గార్లబాయిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సముద్రాల నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కరోనా మహమ్మారి అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థుల చేత నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, కరోనా నిబంధనలు పాటిస్తూ జాతీయ పండుగను ఘనంగా నిర్వహించారు.