నల్గొండలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ఇన్చార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఆడియో శ్రీదేవి మాట్లాడుతూ.. ఎంపిక చేసిన వార్డుల్లో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సర్వే బృందాలు కుటుంబ వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి ఫోటోలు వచ్చేలా ఫోటో తీసుకోవడం జరుగుతుందన్నారు.