తుంగతుర్తి: వేలం పాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు

67చూసినవారు
తుంగతుర్తి: వేలం పాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి. సిద్ధిక్ భాష, అజం అలీ పాల్గొని చీరను రూ. 4100 లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరా హోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్