నల్గొండ: బావిలో పడి రైతు మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన చిన్నబోయిన విఠల్ కు చెందిన బావిలో నుంచి మోటారు తీసేందుకు ఆమనగల్లు గ్రామానికి చెందిన బంటు సైదులును తీసుకెళ్లాడు. ఆదివారం మోటార్ తీసేందుకు బావి లోపలికి వెళ్ళి ప్రమాదవశాత్తు బావిలోనే చనిపోయాడు. స్థానికులు సైదులు డెడ్ బాడీని బావిలో నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.