నాంపల్లి: కందిరీగలు కుట్టి యువకుడు మృతి
కందిరీగలు కుట్టి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం నాంపల్లి మండలం బండ్లగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన గార్లపాటి వంశీధర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి జనగామ, ఆలేరులో విహారయాత్రకు బయలుదేరారు. అక్కడే ఉదయం చలికి చలిమంట కాల్చడంతో కందిరీగల్లేసి కరవడం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.