గుడ్‌న్యూస్.. ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలు!

60చూసినవారు
గుడ్‌న్యూస్.. ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలు!
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు శుభవార్త చెప్పింది. ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలను సరఫరా చేసే సేవలను ప్రారంభించింది. తెలంగాణ సోనా, కూనారం, జగిత్యాల సన్నాలు, దొడ్డు రకాలు KNM 118, JGL 24423, MTU 1010, RNR 29325 విత్తనాలను సరఫరా చేస్తోంది. 15 కేజీల బస్తా ధర రూ.700, 25 కేజీల బస్తాకు రూ.995గా నిర్ణయించింది. రైతులు ప్రాంతీయ మేనేజర్లకు ఫోన్ చేస్తే రవాణా ఛార్జీలు లేకుండానే విత్తనాలు సరఫరా చేస్తారని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్