నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని కంకణాలపల్లి గ్రామ పంచాయతీలో గురువారం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నూతన సంఘ బంధం అధ్యక్షురాలిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ బందం అధ్యక్షురాలిగా సూరారపు సునిత, ఉపాధ్యక్షురాలు ఊరిమిండి ధనమ్మ, కార్యదర్శిగా గండికోట నీలమ్మ, కోశాధికారి వల్లందాసు పద్మ, బుక్ కీపర్ గా గంటెకంపు స్రవంతి తదితరులు ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోన జానయ్య, గంటెకంపు కృష్ణ, సూరారపు జానయ్య, మంద మాధవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.